టాలీవుడ్

ప్లీజ్‌.. ఆ వార్త‌ను న‌మ్మొద్దంటున్న‌స‌మంత‌..

samantha

ముసి ముసి న‌వ్వుల స‌మంత ప్లీజ్.. ద‌య‌చేసి ఆ వార్త‌ను న‌మ్మ‌వ‌ద్దంటూ వేడుకుంటుంది. ఈ అందాల చుల్‌బులీకి త్వ‌ర‌లో అక్కినేని నాగ‌చైత‌న్య‌తో మూడు ముళ్ల బంధంలోకి అడుగు పెట్ట‌బోతుంది. ఈ నేప‌థ్యంలో ప్లీజ్ నేను చెప్పేది న‌మ్మండి అంటోంది.. ఆ వార్త‌ను మాత్రం అస్స‌లు న‌మ్మ‌ద్దంటోంది. ఆ వార్త‌ను న‌మ్మొద్ద‌ని ఆమె స్వ‌యంగా వేడుకోవ‌డంతో ఇంత‌కీ ఆ వార్త ఏంటో తెలుసుకోవాల‌ని జ‌నాల్లో ఆస‌క్తి ఇంకా పెరిగింది.. అసల విష‌యం ఏంటంటే అత్తారింటికి దారేది సినిమాకు సీక్వెల్ వ‌స్తోంద‌ని, ఆ సీక్వెల్ సినిమాలో స‌మంత న‌టిస్తోంద‌ని టాలీవుడ్‌లో గుసగుస‌లు వినిపిస్తున్నాయి. మాట‌ల మాంత్రికుడు, ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్.. హారిక హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ‘అత్తారింటికి దారేది’ సినిమాకు సీక్వెల్ వ‌స్తోంద‌ని, ఆ సినిమాకు ‘దేవుడే దిగివ‌చ్చినా’ అనే టైటిల్ ఖ‌రారు చేశార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఈ సినిమా షూటింగ్ డిసెంబ‌ర్ నుంచి ప్రారంభ‌మ‌వుతుంద‌ని కొంద‌రు చెబుతున్నారు. ఆ సినిమాలో హీరోగా ప‌వ‌న్ క‌ల్యాణ్‌, ఆయ‌న స‌ర‌స‌న హీరోయిన్‌గా స‌మంత న‌టిస్తోంద‌ని వార్త‌లు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. స‌మంత మాత్రం ఆ సినిమాలో న‌టిస్తున్నానంటూ వ‌చ్చిన‌ వార్త‌ల‌ను కొట్టిపారేసింది.. ఆ వార్త‌లు నిజం కాదంటూ ఆమె ట్వీట్ చేసింది. ఆ వార్త‌లు అస‌లు న‌మ్మ‌వ‌ద్ద‌ని త‌న అభిమానుల‌ను ఆమె కోరింది. అయితే అత్తారింటికి దారేది సినిమాకు సీక్వెల్ రావ‌డం అనే మాట‌ల‌ను న‌మ్మ‌వ‌ద్దంటుందా… లేక ఆ సినిమా సీక్వెల్‌లో హీరోయిన్‌గా తాను న‌టించడం నిజం కాదు.. అని చెబుతుందా.. అనే విష‌యాన్ని స‌మంత స్ప‌ష్టం చేయ‌లేదు.

దీంతో స‌రైన క్లారిటీ లేక అయోమ‌యంలో అభిమానులు ఉన్నారు. ఏది నిజ‌మో ఏది అబ‌ద్ధ‌మో అభిమానుల‌కు అర్ధం కాలేదు. కాబ‌ట్టి స‌మంత ఫుల్ క్లారిటీ ఇవ్వ‌క‌పోవ‌డంతో ఆమె ట్వీట్ చేశాక కూడా స‌స్పెన్స్ కొన‌సాగుతూ ఇంకాస్త చ‌ర్చ‌కు దారితీశాయి.