టాలీవుడ్ సినిమా

మూడు పువ్వులు – ఆరు కాయలు

మూడు పువ్వులు – ఆరు కాయలు, (అక్టోబర్ 12 న ) భారి ఏత్తున విడుదల కానున్న ఈ సినిమాను అసలు ఎందుకు చూడాలి, ఈ సినిమాపై ప్రేక్షకులలో అంచనాలు విపరీతంగా పెరగటానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
విడుదల అయిన ఫస్ట్ లుక్ నుండి టిజర్, ట్రైలర్, ఆడియో వరకూ ప్రేక్షకులలో మంచి అంచనాలు పెంచిన సినిమా మూడు పువ్వులు – ఆరు కాయలు.

ఏన్నో సినిమాలకు రచయతగా పనిచేసిన రామస్వామి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. మంచి కామెడి తో యూత్ ఫుల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది ఈ సినిమా. షార్ట్ ఫిలిం ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న భరత్ బండారు ఈ సినిమా ద్వారా హీరోగా పరిచయం అవుతున్నాడు.

కృష్ణ సాయి అందించిన మ్యూజిక్ ఇప్పటికే పెద్ద హిట్. చంద్రబోసు గారు రచించిన పాట ఏస్.పి బాలు గారు పాడటం, భాస్కరభట్ల రచించిన పాట సాయి చరణ్ పాడటం మరో ప్రధాన ఆకర్షణ. టాప్ ఆర్ట్ డైరెక్టర్ కెవి రమణ వర్క్ ఈ సినిమాకు మరొక అసెట్. మోహన చంద్ర కెమెరా పనితనం అందరిని ఆకట్టుకుంటుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీ భారీ తారాగణం మొత్తం ఈ సినిమాలో నటించారు.

ప్రేమ గురించి అద్భుతంగ చెప్పిన సినిమా ఇది. ఆప్యాయతలు దూరమవుతున్న మనుషుల మధ్య మల్లి బంధాలు, ప్రేమలు చిగురించేలా ఈ సినిమా కథనం నడుస్తుంది. అమ్మాయిలు అబ్బాయిలను, అబ్బాయిలు అమ్మాయిలను, ఈ కాలంలో ప్రేమ అని చెప్పి ఏ విధంగా మోసం చేస్తున్నారో కధంశంగా తెరకెక్కినది ఈ సినిమా. మరియు పిల్లలు పేరెంట్స్ నీ ఏలా మోసం చేస్తున్నారు అనేది కూడా అందంగా వివరించి చెప్పబడింది.

ప్రేమంటే చంపడమో చావడమో కాదు, చచ్చేదాకా కలసి బ్రతకడం.మీ కన్న వాళ్ళ కలలతో పాటు, మీరు కోరుకున్న లక్ష్యాలు మీరు చేరుకోగలిగితే ప్రతి ఒక్కరి జీవితం మూడు పువ్వులు – ఆరు కాయలు. రైతుల కష్టం, జీవన విధానాలు గురించి కూడా అద్భుతంగ చూపించారు. ఆనందింపజేస్తుంది మరియు ఆలోచింపజేస్తుంది. నవ్వినా – ఏడ్చిన కన్నిల్లె. యూత్ ఖచ్చితంగా చూడదగిన చిత్రం. ఈ పండగకు మంచి హిట్ చిత్రం గా నిలవడం గ్యారెంటి.