టాలీవుడ్ సినిమా

ఎన్టీఆర్ బయోపిక్ లో బాలయ్య లీక్..!

నందమూరి బాలకృష్ణ చేస్తున్న ఎన్.టి.ఆర్ సినిమా ప్రమోషన్స్ ఓ రేంజ్ లో చేస్తున్నారు. ఇప్పటికే ఒక సినిమా రెండు పార్టులంటూ సర్ ప్రైజ్ ఇవ్వగా ఇక ఇప్పుడు ఎన్.టి.ఆర్ లా కనిపిస్తూ అలరిస్తున్నాడు బాలకృష్ణ. షూటింగ్ కు ఎన్.టి.ఆర్ రిక్షా మీద వచ్చేవారట. ఆయన్ను చూసి ఎదురుగా ఎవరుపడే వారు కాదట.

ఒకవేళ ఎవరైనా వచ్చినా ఏం బ్రదర్ అని ఆయన గంభీరమైన మాటతోనే హడలెత్తిపోయే వారట. అలాంటి రిక్షావోడి గెటప్ ను బాలయ్య ఎత్తారు. అయితే సూటు వేసి రిక్షా తొక్కుతూ వచ్చిన బాలకృష్ణ అభిమానులను అలరించాడు. ఇది సినిమాలో సీనా లేక ప్రమోషన్స్ కోసమే తెలియదు కాని బాలకృష్ణ రిక్షా ఎక్కడం మాత్రం హాట్ న్యూస్ గా మారింది.

ఇక క్రిష్ డైరక్షన్ లో వస్తున్న ఎన్.టి.ఆర్ బయోపిక్. రెండు భాగాలుగా వస్తున్న సంగతి తెలిసిందే. కథానాయకుడు జనవరి 9న వస్తుండగా.. మహానాయకుడు జనవరి 24న వస్తుంది.