fbpx
రాజకీయం

బాబు ఈ మిస్టేక్‌లు స‌రిచేస్తే 2019లో ప్ర‌కాశంలో వార్ వ‌న్‌సైడే..!

prakasam war onside tdp

రాష్ట్రంలో అధికార పార్టీ టీడీపీ చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో అత్యంత బ‌లంగా ఉంది. ఆయా స్థానాల్లో నేత‌ల‌ను మార్చినా కూడా సైకిల్ ప‌రుగులు ఆగేలా క‌నిపించ‌డం లేదు. ఇక‌, మ‌రికొన్ని చోట్ల మాత్రం వైసీపీ హ‌వా న‌డుస్తోంది. ముఖ్యంగా అత్యంత వెనుక‌బ‌డిన ప్ర‌కాశంలో టీడీపీకి కొన్ని చోట్ల మాత్ర‌మే ప‌ట్టుంది. ప్ర‌స్తుతం ప్ర‌కాశంలో ఒంగోలు, ద‌ర్శి నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు బ‌లంగా ఉన్నారు. కానీ, కొన్ని స్థానాల్లో మాత్రం టీడీపీకి ఇబ్బంది క‌ర ప‌రిణామాలే ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ప‌రిస్థితినికొంచెం స‌రిదిద్దితే.. టీడీపీ హ‌వా ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ కొన‌సాగ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. నియోజ‌క‌వ‌ర్గాల వారిగా చూస్తే.. ఒంగోలు, ప‌రుచూరు, చీరాల నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ హ‌వా భారీ ఎత్తున సాగుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ తిరుగులేని శ‌క్తిగా అవ‌త‌రించ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

damacharla janardhan

ఒంగోలులో జిల్లా పార్టీ అధ్య‌క్షుడు జ‌నార్థ‌న్ చేసిన కోట్లాది రూపాయ‌ల అభివృద్ధికి ఇక్క‌డ జ‌నాలు జేజేలు కొడుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ ఆయ‌న గెలుపున‌కు తిరుగులేదు.

ఇక ప‌రుచూరులే ఏలూరు సాంబ‌శివ‌రావు దూకుడు ముందు వైసీపీ స‌రైన క్యాండెట్‌ను నిల‌బెట్టుకునే ప‌రిస్థితి లేదు. చీరాల‌లో ఆమంచి హవా ముందు వైసీపీ నిల‌బ‌డ‌లేక‌పోతోంది. +అదేవిధంగా గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ గెలుపొందిన అద్దంకిలో టీడీపీ ప‌రిస్థితి అటు ఇటుగా ఉంది. ఇక్క‌డ నుంచి గెలిచిన గొట్టిపాటి ర‌వి.. త‌ర్వాత టీడీపీలో చేరిపోయారు. అయితే, ఇక్క‌డ టీడీపీ సీనియ‌ర్ నేత‌గా ఉన్న క‌ర‌ణం బ‌ల‌రాం.. ర‌వి రాక‌ను జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ నేప‌థ్యంలో ఇద్ద‌రు నాయ‌కుల మ‌ధ్య ఆధిప‌త్య పోరు సాగుతోంది. బ‌ల‌రాం కాస్త శాంతిస్తే ర‌వికి తిరుగులేని మెజార్టీ వస్తుంది. ఇక్క‌డ ఈ ఇద్ద‌రు నేత‌ల మ‌ధ్య స‌మ‌న్వ‌యం తీసుకు వ‌స్తే.. టీడీపీకి తిరుగులేని మెజారిటీ వ‌స్తుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. కొండ‌పిలో ప్ర‌స్తుత ఎమ్మెల్యే డోలా బాల వీరాంజ‌నేయ‌ స్వామికి రిమార్కులు లేవు, అవినీతి లేదు. వ్య‌క్తిగ‌తంగా కూడా ఆయ‌న డాక్ట‌ర్ కావ‌డంతో మంచి ఇమేజ్ సంపాయించు కున్నారు.

Bala Veeranjaneya Swamy

అభివృద్ధి విష‌యంలోనూ ఆయన దూసుకు పోతున్నారు. అయితే, టీడీపీలో నేత‌ల‌ను స‌మ‌న్వ‌యం చేసుకోవ‌డం లేద‌నే విమ‌ర్శ‌లు మాత్ర‌మే ఆయ‌న‌ను వెంటాడుతున్నాయి. గ్రామాల్లో పార్టీలో కొంత‌మంది నాయ‌కుల‌తో ఉన్న గ్యాప్ స‌రిచేసుకుంటే డోలా మ‌ళ్లీ ఇక్క‌డ పోటీ చేసినా గెలుపు ఖాయ‌మ‌నే మాట విన‌బ‌డుతోంది. మార్కాపురంలో నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ మాజీ ఎమ్మెల్యే కందుల నారాయ‌ణ‌రెడ్డి ఈ ఆరు నెలల్లో ఇంకా చేయించాల్సిన ప‌నులు స్పీడ్‌గా చేయించి దూకుడు పెంచాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. సానుభూతి ప‌వ‌నాలు కూడా ఆయ‌న‌కు క‌లిసి వ‌స్తున్నా యి. ఆదిశ‌గా పార్టీ అధినేత దృష్టి సారిస్తే.. విజ‌యం ఖాయ‌మ‌నే వ్యాఖ్య‌లు స‌ర్వ‌త్రా వినిపిస్తున్నాయి.,

ఎర్ర‌గొండ‌పాలెం ఎమ్మెల్యే డేవిడ్‌రాజు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు… ఇక్క‌డ ఆయ‌న నాయ‌కుల మ‌ధ్య స‌మ‌న్వ‌యం చేసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. సంత‌నూత‌ల‌పాడులో నాలుగు మండ‌లాల పార్టీ నాయ‌కుల‌తోనూ ఇన్‌చార్జ్ విజ‌య్‌కుమార్‌కు తీవ్రమైన గ్యాప్ ఉంది. ఇక్క‌డ చంద్ర‌బాబు వీరి మ‌ధ్య గొడ‌వ సెట్ చేస్తే ఇక్క‌డ కూడా పార్టీ మ‌రింత బ‌ల‌ప‌డి వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం ఖాయ‌మ‌ని అంటున్నారు. గ‌త ఎన్నిక‌ల్లోనే కేవ‌లం స్వ‌ల్ప మెజార్టీతో ఇక్క‌డ టీడీపీ ఓడిపోయింది. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఈ గ్యాప్‌ను త‌గ్గించుకుని ముందుకు సాగాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.

Muthumula Ashok Reddy M.L

ప‌శ్చిమ ప్ర‌కాశంలోని కీల‌క నియోజ‌క‌వ‌ర్గాల్లో ఒక‌టి అయిన గిద్ద‌లూరులో వైసీపీ నుంచి గెలిచిన ముత్త‌ముల అశోక్‌రెడ్డి పార్టీ మారి టీడీపీలో చేరారు. ఆయ‌న నియోజ‌క‌వర్గ చ‌రిత్ర‌లోనే ఎవ్వ‌రూ చేయ‌లేని అభివృద్ధి చేస్తున్నారు. అయితే, టీడీపీలోని పాత‌, కొత్త నాయ‌కుల మ‌ధ్య స‌మ‌న్వ‌య లోపం ఉంది.. అది స‌రి చేసుకుంటేనే త‌ప్ప‌.. ఇక్క‌డ పార్టీ పుంజుకునే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. సో.. దీనిని స‌రిచేసుకుంటే.. టీడీపీకి తిరుగులేదు! క‌నిగిరిలో ఇంకా విస్తృత స్థాయిలో నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల్సిన అవ‌స‌రం ఉంది. ఇటీవ‌ల పామూరులో ట్రిపుల్ ఐటీతో పాటు నియోజ‌క‌వ‌ర్గ అభివృ ద్ధికి బాబు నిధులు ఇవ్వ‌డం ప్ల‌స్ అయ్యింది. ఇక్క‌డ నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న క‌దిరి బాబూరావు ఈ ఆరు నెల‌లు బాగా క‌ష్ట‌ప‌డాల‌నేది సీనియ‌ర్ల ఉవాచ‌!

pothula ramarao

కందుకూరులో ఎమ్మెల్యే పోతుల రామారావు పార్టీ మారారు. ఆయ‌న వ్యూహాల్లో దిట్ట అయినా నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న‌తో పార్టీ మారిన వారికే కాకుండా పాత వారికి ప్రాధాన్యం ఇస్తూ వాళ్ల‌ను కూడా స‌మ‌న్వ‌యం చేసుకోవాలి… ఇక్క‌డ మ‌హీధ‌ర్‌రెడ్డి వైసీపీ అభ్య‌ర్థి కావ‌డంతో పోటీ హోరా హోరీగా సాగ‌నుంద‌ని తెలుస్తోంది. అయితే టీడీపీ చాలా బ‌లంగా ఉంది… లోపాలు స‌రిచేసుకుంటే గెలుపు పోతుల‌దే అంటున్నారు ప‌రిశీల‌కులు. ద‌ర్శిలో మంత్రి శిద్దా రాఘ‌వ‌రావు.. అభివృద్ధి విష‌యంలో రాజీ ప‌డ‌డం లేదు. ప్ర‌తి ఒక్క‌రి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తున్నారు. వ్య‌క్తిగ‌త ఇమేజ్ బాగుంది… రిమార్కులు లేవు. అయితే ఆయ‌న గ‌త ఎన్నిక‌ల్లోనూ చాలా స్వ‌ల్ప‌ మెజార్టీతో గెలిచారు. వైసీపీ బ‌ల‌హీన‌త‌ల వ‌ల్ల ప్ల‌స్ కావ‌డం కంటే ఆయ‌న మ‌రింత స్ట్రాంగ్ అయితేనే ఈ సారి ఎక్కువ మెజార్టీ వ‌చ్చే ఛాన్సులు ఉన్నాయి. మ‌రి ఆ దిశ‌గా టీడీపీ కృషి చేయాల‌ని సూచిస్తున్నారు సీనియ‌ర్లు!!