టాలీవుడ్ రాజకీయం వార్తలు సినిమా

చంద్రబాబు నాయకత్వం గురించి విజయ్ దేవరకొండ ఎంత గొప్పగా చెప్పాడో చూడండి

ప్రస్తుంతం తాలీవుడ్ లో మంచి జోష్ మీదున్న హీరో విజయ దేవరకొండ. అయన తాజా చిత్రం ` నోటా ` సినిమా ప్రమోషన్ లో బాగంగా పలు సంచలనవాఖ్యలు చేసారు. ` నోటా ` పొలిటికల్ నేపధ్యంలో సాగే సినిమా కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో జరిగే రాజకీయ నేపధ్యం పై అయన స్పందించారు.

‘‘చిన్నప్పుడు చంద్రబాబు నాయుడు నాయకత్వం అంటే చాలా ఇష్టం. ఆయన హయాంలోనే హైదరాబాద్‌ నగరానికి బూమ్‌ వచ్చింది. సమయ పాలన విషయంలో ప్రభుత్వోద్యోగులు చాలా హడావుడి పడటం చూసేవాణ్ని. అలా స్ట్రిక్ట్‌గా ఉంటే నాకు ఇష్టం. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వ పాలన నాకు బాగా నచ్చింది. పాలనలో స్థిరత్వం కనిపిస్తోంది. కేటీఆర్‌ని కలిసిన తర్వాత ఆయన ఆలోచనలు నన్ను బాగా ప్రభావితం చేశాయి అని విజయ్ తెలిపాడు. అయితే తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితుల్లో విజయ్, చంద్రబాబుపై చేసిన కామెంట్ హాట్ టాఫిక్ గా మారాయి